TSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సప్‌లోనే టికెట్

by Nagaya |   ( Updated:2023-12-11 14:43:53.0  )
TSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సప్‌లోనే టికెట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు ఆర్టీసీ అధికారులు వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ప్రయాణికులకు చేరువ అవుతున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో అపరిమితం కాకుండా అన్ని రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు వివిధ పథకాల పేరుతో బస్ ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఆర్టీసీ అధికారులు మరో ముందడుగు వేశారు. ప్రయాణికులకు ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటి దగ్గర నుంచే టికెట్ కొనుగోలు చేసి బస్ ఎక్కేలా ఏర్పాట్లు చేశారు.

మెట్రో టికెట్స్ బుకింగ్ మాదిరిగానే ఆర్టీసీ బస్ టికెట్లను కూడా వాట్సప్ నంబర్‌తో కొనుగోలు చేసే టెక్నాలజీని రూపొందించారు. దీనిని ఇప్పటి వరకు అధికారికంగా ప్రారంభించకున్నా.. ప్రయోగత్మకంగా ట్రయల్ రన్ నడుస్తోంది. టికెట్ కొనుగోలు చేయాలనుకునే వారు ఆర్టీసీకి సంబంధించిన QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అధికారులు ప్రకటించిన వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేయాలి. అయితే ఇలా వాట్సప్‌లో టికెట్స్ కొనుగోలు చేసేవారికి కొన్ని కండీషన్స్ పెట్టారు అధికారులు. వాట్సప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్‌ను రద్దు చేసుకునే అవకాశం లేదు. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే మార్జినల్ కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తారు. యూపీఏ చెల్లింపులకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed