ILO: దేశీయంగా పదేళ్లలో 6.3 శాతం తగ్గిన తక్కువ వేతనం పొందే కార్మికులు

by S Gopi |
ILO: దేశీయంగా పదేళ్లలో 6.3 శాతం తగ్గిన తక్కువ వేతనం పొందే కార్మికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో తక్కువ వేతనం పొందే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజర్(ఐఎల్ఓ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2008-2018 మధ్య కాలంలో తక్కువ జీతం పొందే కార్మికుల సగటున 6.3 శాతం, తక్కువ జీతం తీసుకునే నాన్-వేజ్ వర్కర్లు 12.7 శాతం మేర తగ్గారు. తక్కువ వేతనం తీసుకునే కార్మికులు, నాన్-వేజ్ వర్కర్లు ఇద్దరి వాటా గడిచిన పదేళ్లలో సగటున 11.1 శాతం క్షీణించినట్టు నివేదిక హైలైట్ చేసింది. దేశంలో ఉన్న సగటు గంట వేతనంలో 50 శాతం కంటే తక్కువ జీతం తీసుకునే కార్మికుల వాటా 9.5 శాతంగా ఉంది. ఇది పొరుగున్న పాకిస్తాన్‌లో 9.4 శాతం, నేపాల్‌లో 10.5 శాతం, బంగ్లాదేశ్‌లో 11.2 శాతం, భూటాన్‌లో 13.7 శాతం, శ్రీలంకలో 25.9 శాతంగా ఉంది. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మూడింట రెండు వంతుల దేశాల్లో వేతన అసమానతలు తగ్గాయని నివేదిక స్పష్టం చేసింది. అధిక, తక్కువ వేతనాన్ని సంపాదించే వారిని పోలిస్తే ఈ అసమానత అనేక దేశాల్లో సగటున ఏడాదికి 0.5 శాతం నుంచి 1.7 శాతం మధ్య తగ్గింది. ఇది కొంత సానుకూలమే అయినప్పటికీ వేతన వ్యత్యాసం గణనీయంగా ఉందని పేర్కొంది. తక్కువ-ఆదాయ దేశాలలో గత 20 ఏళ్లలో సగటు వార్షిక వేతన అసమానత తగ్గుదల 3.2-9.6 శాతం మధ్య ఉంది. సంపన్న దేశాలలో ఇది 0.3-1.3 శాతం, అధిక-ఆదాయ దేశాలలో 0.3-0.7 శాతం మధ్య ఉందని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story