- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో జాతీయ జెండా
న్యూఢిల్లీ: అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అంతరిక్షంలోనూ జాతీయ జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్పేస్ కిడ్జ్ ఇండియా మువెన్నెల పతాకాన్ని బెలూన్ సహాయంతో 30 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోమవారం షేర్ చేస్తూ 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగమయ్యామని ట్వీట్ చేసింది. ప్రతిరోజు దేశాన్ని గర్వించేలా కృషి చేస్తున్న వ్యక్తులకు, స్వాతంత్ర్య పోరాట యోధులకు ఇది నివాళి అని పేర్కొంది. కాగా, ఈ మధ్యనే ఇస్రో ప్రయోగించిన రాకెట్‌లో స్పేస్ కిడ్జ్ అజాదిశాట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే అస్థిరమైన కక్ష్యలోకి ప్రవేశించడంతో శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ భారత పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని ఇండో అమెరికన్ వ్యోమోగామీ రాజా చారీ షేర్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో భారత జెండా రెపరెపలాడుతున్న దృశ్యాలను ట్వీట్ చేశారు.