- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పుష్పక’ విమానం రెడీ.. రేపే ప్రయోగం!
దిశ, నేషనల్ బ్యూరో : సంపదకు అధిపతి అయిన కుబేరుడి వాహనం.. పుష్పక విమానం !! పుష్పక విమానం తయారీ కోసం గత 15 ఏళ్లుగా మన దేశ శాస్త్రవేత్తలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆ దిశగా కీలక ముందడుగు పడనుంది. ‘పుష్పక్’ పేరుతో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వీ)ను కర్ణాటకలోని డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న చలకెరె రన్‌వే నుంచి ప్రయోగించనున్నారు. రాకెట్‌నే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని పిలుస్తారు. ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇప్పటివరకు మన ఇస్రో ఉపయోగిస్తున్న రాకెట్లు వాటి పనిని పూర్తి చేశాక సముద్రంలో కూలిపోతుంటాయి. కానీ తనతో పాటు తీసుకెళ్లే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి వదిలేశాక.. సురక్షితంగా తిరిగి భూమిపైకి వచ్చేయడమే ‘పుష్పక్’ రాకెట్ ప్రత్యేకత. గత నెలలో కేరళలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ పుష్పక్ గురించి వివరించారు. అంతకు ముందు 2016లో ఒకసారి, 2023 ఏప్రిల్ 2న రెండోసారి ‘పుష్పక్’ రాకెట్‌ను పరీక్షించారు. దాన్ని పరీక్షిస్తుండటం ఇది మూడోసారి.
‘పుష్పక్’ ప్రయోగం.. విశేషాలు
* పుష్పక్ రాకెట్ పొడవు 6.5 మీటర్లు, బరువు 1.75 టన్నులు ఉంటుంది.
* దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సైనిక హెలికాప్టర్ మోసుకెళ్లి.. గగనతలం నుంచి జారవిడుస్తుంది.
* హెలికాప్టర్ నుంచి అది గాల్లోకి రిలీజ్ అయ్యాక.. భూమి వైపుగా దూసుకొస్తుంది. ఈక్రమంలో పుష్పక్ రాకెట్ ఒక గ్లైడర్‌లా పనిచేస్తుంది.
* గాల్లో ఉండగా పుష్పక్ రాకెట్‌లో ఉండే చిన్నపాటి థ్రస్టర్లు యాక్టివ్ అవుతాయి. ఏ వైపు ప్రయాణం చేయాలి? ఎక్కడ ల్యాండ్ కావాలి ? అనే దానిపై ఈ థ్రస్టర్లే ‘పుష్పక్’ రాకెట్‌కు అంతర్గతంగా డైరెక్షన్ ఇస్తాయి.
* థ్రస్టర్ల డైరెక్షన్‌కు అనుగుణంగా పుష్పక్ తనను తాను నావిగేట్ చేసుకుంటూ.. నిర్దేశిత ప్రదేశానికి చేరుకుంటుంది.
* పుష్పక్ రాకెట్‌ను డెవలప్ చేసే ప్రాజెక్టుపై భారత సర్కారు ఇప్పటిదాకా దాదాపు రూ.100 కోట్లకుపైనే ఖర్చు చేసింది.
* 2035 నాటికి భారత్ ఏర్పాటు చేయనున్న సొంత అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు ‘పుష్పక్’ ఎంతో దోహదం చేస్తుందని అంటున్నారు.
* ఇప్పటికే అంతరిక్షంలో వివిధ కక్ష్యల్లో ఉన్న మన ఉపగ్రహాలను రిపేర్ చేసేందుకు, వాటిలో ఇంధనాన్ని నింపేందుకు ‘పుష్పక్’ను వాడుకోవాలని ఇస్రో భావిస్తోంది.