Indian Navy : ఇండియన్ నేవీ చొరవ..సముద్రంలో చిక్కుకున్న 54మంది సురక్షితం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-16 06:21:29.0  )
Indian Navy : ఇండియన్ నేవీ చొరవ..సముద్రంలో చిక్కుకున్న 54మంది సురక్షితం
X

దిశ, వెబ్ డెస్క్: సముద్రం(Sea)లో ప్రాణాపాయం(Life threatening)లో చిక్కుకున్న 54మంది ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ (IGC) సిబ్బంది సకాలంలో చూపిన చొరవతో సురక్షితం(Safe)గా ప్రాణాలతో బయటపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్(Lakshadweep)సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న పడవ(Boat)ఆకస్మాత్తుగా అదృశ్యమైన(Missing) ఘటనలో ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక సిబ్బంది రక్షించారు.

వీరిలో 22 మంది మహిళలు, 23 మంది పిల్లలు, 9మంది పురుషులు, పడవ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. జనవరి 14వ తేదీ మంగళవారం, కవరట్టి నుండి సుహేలిపార్ ద్వీపానికి వెళ్తున్న పడవ మహమ్మద్ కాసిమ్-II అకస్మాత్తుగా అదృశ్యమైంది. అందులో 54 మంది ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించి లక్షద్వీప్ నుండి కాల్ అందిన తర్వాత, ఐజీసీ నౌక సిబ్బంది వెంటనే స్పందించి పడవ కోసం వెతకడానికి ఆపరేషన్ ప్రారంభించింది.

ఈ సమయంలో పడవలోని ప్రయాణీకులు, సిబ్బందితో ఎటువంటి సంబంధాలు లేకపోవడం ఆందోళనకు గురిచేసింది. నేవీ సెర్చ్ ఆపరేషన్, ఐఎఫ్ బీ..కోస్టల్ సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా పడవ ఆచూకీ తెలుసుకున్నారు. 1600గంటల తర్వాత ప్రయాణికులను సురక్షితంగా తిరిగి కవరట్టి చేర్చి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed