- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Modi: చరిత్రలో తొలిసారి భారత్‌పైనే ప్రపంచ దృష్టి

దిశ, నేషనల్ బ్యూరో: సమీప భవిష్యత్తులో కూడా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ.. దేశ చరిత్రలో ప్రపంచం మొత్తం భారత్ పట్ల ఆశాభావంతో ఉండటం ఇదే తొలిసారి. సామాన్యులు మొదలుకొని వివిధ దేశాలు, సంస్థలు ప్రతి ఒక్కరూ భారత్‌పై ఎక్కువ అంచనాలతో ఉన్నారు. వచ్చే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ కూడా ఇటీవల తన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలో పేర్కొంది. అన్ని రాష్ట్రాలలో పెట్టుబడులకు అనుకూలమైన రెగ్యులేటరీ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు డీరెగ్యులేషన్ కమిషన్ సహాయం చేస్తుందని మోడీ అన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థలకు భారత్ అగ్రశ్రేణి సరఫరా కేంద్రంగా ఎదుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో టెక్స్‌టైల్, టూరిజం, టెక్నాలజీ రంగాలు కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 18 కొత్త పాలసీలను ఆవిష్కరించారు. మెరుగైన టాలెంట్, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలతో మధ్యప్రదేశ్ బిజినెస్ డెస్టినేషన్‌గా మారుతోందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు.