రాక్స్ క్షిపణి ప్రయోగం విజవంతం..!

by Dishanational6 |
రాక్స్ క్షిపణి ప్రయోగం విజవంతం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ కొత్త వర్షన్ ను విజయవంతం పరీక్షించింది రక్షణ శాఖ. ఇది 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అండమాన్, నికోబార్ దీవుల్లో భారత వైమానిక దళం ఈ క్షిపణిని ప్రయోగించింది. ఇజ్రాయెల్ తయారు చేసిన క్రిస్టల్ మేజ్ 2 ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇది. దీన్నిరాక్స్ అని కూడా అంటారు.

రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యూహాత్మక బలగాల కమాండ్ ఆధ్వర్యంలో టెస్ట్ ఫైరింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 23న స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో మీడియం-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి కొత్త వేరియంట్ ప్రయోగం విజవంతంమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆపరేషన్ మిస్సైల్ ఆపరేషనల్ కెపాసిటీని, కొత్త టెక్నాలజీలను ధ్రువీకరించిందని వివరించింది.

అండమాన్‌ భూభాగంలోని టెస్ట్ రేంజ్‌లో సు-30 ఎమ్‌కెఐ ఫైటర్ జెట్ ద్వారా క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు పర్యవేక్షిస్తున్న ప్రాంతంలోనే టెస్ట్ ఫైరింగ్ కోసం సన్నాహాలు జరిగాయి.

ఇకపోతే, వైమానిక దళం మేక్ ఇన్ ఇండియా చొరవ ద్వారా ఎక్కువగా ఇజ్రాయెల్ క్షిపణులను పొందాలని యోచిస్తోంది. ఐఎఫ్ ద్వారా సు-30 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో, అధిక వేగంతో లక్ష్యం వైపునకు దూసుకెళ్తుంది.

క్రిస్టల్ మేజ్ 1తో పోలిస్తే ఈ క్రిసట్ల్ మేజ్ 3 భిన్నంగా ఉంటుంది. స్టాండ్-ఆఫ్ రేంజ్ ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణే ఈ రాక్స్. ఈ క్షిపణి కార్గిల్ యుద్ధ సమయంలో జీపీఎస్ నిరాకరించడంతో మిస్సైల్స్ ప్రయోగం ఫెయిల్ అయ్యింది. అలాంటి ప్రాంతంల్లోనూ లక్ష్యాలను నిర్వీర్యం చేసే సామర్థ్యం కలదని పేర్కొన్నారు అధికారులు.



Next Story

Most Viewed