లక్షద్వీప్ లో కొత్తగా మరో ఎయిర్ పోర్టు..!

by Shamantha N |
లక్షద్వీప్ లో కొత్తగా మరో ఎయిర్ పోర్టు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవులు- లక్షద్వీప్ వివాదం కొనసాగుతున్న వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది. మోడీ పర్యటన తర్వాత లక్షద్వీప్ గురించి గూగుల్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగింది. దీంతో అక్కడికి వెళ్లే వారి సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. లక్షద్వీప్ ను పర్యాటకరంగంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లక్షద్వీప్‌లో కొత్తగా మరో ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్రం. పౌరవిమాన సర్వీసులతో పాటు సైనిక అవసరాలకు ఎయిర్ పోర్టు నిర్మించాలని యోచిస్తోంది కేంద్రం. ప్రస్తుతం లక్షద్వీప్ లోని అగట్టీలో ఎయిర్ పోర్ట్, కవరత్తీలో హెలీప్యాడ్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మినికాయ్ ఐలాండ్స్ లో ఎయిర్ పోర్టు అవసరమని నిర్ణయించింది కేంద్రం. పర్యాటకుల తాకిడి తట్టుకునేందకు మినికాయ్ లో ఎయిర్ పోర్టు నిర్మించనున్నారు. అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలంటూ సంబంధిత మంత్రిత్వ శాఖకు ఆదేశాలిచ్చింది కేంద్రం. మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ టేకాఫ్, ల్యాండింగ్ తీసుకోవడానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed