భారత్ మాల్దీవులు కలిసి పని చేయాలి: ముయిజ్జుతో జైశంకర్ భేటీ

by vinod kumar |
భారత్ మాల్దీవులు కలిసి పని చేయాలి: ముయిజ్జుతో జైశంకర్ భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, మాల్దీవులు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ సోమవారం మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో జైశంకర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత వీరిద్దరూ భేటీ కావడం గమనార్హం. ఈ మీటింగ్ అనంతరం జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘న్యూఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జును కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇరు దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

కాగా, ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత వ్యతిరేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముయిజ్జు భారత్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముయిజ్జుతో భేటీ కన్నా ముందు జైశంకర్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా ఇతర విదేశీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. భారత్-బంగ్లాదేశ్, భారత్-శ్రీలంక, ఇతర దేశాలతో భారత్ తన భాగస్వా్మ్యాన్ని పెంచుకుంటుందని నొక్కి చెప్పారు. మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైన విదేశీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed