Crude Oil:ముడిచమురు ఎగుమతిలో ఆ దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్

by Jakkula Mamatha |   ( Updated:2024-11-01 04:47:31.0  )
Crude Oil:ముడిచమురు ఎగుమతిలో ఆ దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్
X

దిశ,వెబ్‌డెస్క్: యూరప్‌కు అతి పెద్ద ముడి చమురు సరఫరాదారు(Crude oil supplier)గా భారత్ నిలిచింది. దీంతో సౌదీ అరేబియా(Saudi Arabia) వెనక్కి వెళ్ళిపోయింది. కెప్లర్ నివేదిక ప్రకారం .. యూరోపియన్ యూనియన్(European Union) దేశాలకు భారతీయ రిఫైనరీలు నుంచి శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో గణనీయంగా పెరుగుదల నమోదైంది. యూరోపియన్ దేశాలకు భారత్ ప్రతి రోజూ 3.60 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతి(Export of crude oil) చేసింది. రాబోయే సంవత్సరం ఏప్రిల్ నాటికి ఎగుమతులు 20 లక్షల బ్యారెల్స్‌ను దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఉక్రెయిన్‌(Ukraine)తో యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా భారీ తగ్గింపుతో ముడి చమురును భారత్‌కు అందించింది.

ఈ నేపథ్యంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్‌కు భారత్ రోజుకు 1.54 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన చమురు ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత 2 లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో మాస్కోకు భారత్‌ కీలక మార్కెట్‌గా మారింది. పలు దేశాలు విమర్శలు చేసినప్పటికీ రష్యా నుంచే భారత్‌ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇదే జరుగకపోతే పెరుగుతున్న చమురు ధరలు, ద్రవోల్బణం నేపథ్యంలో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేది. రష్యా నుంచి 3.35 బిలియన్లు, సౌదీ నుంచి 2.30 బిలియన్లు, ఇరాక్‌ 2.03 బిలియన్‌ డాలర్ల ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకుంటున్నది.

Advertisement

Next Story