మత స్వేచ్ఛపై అమెరికా నివేదికను ఖండించిన భారత్

by S Gopi |   ( Updated:2024-06-28 14:36:36.0  )
మత స్వేచ్ఛపై అమెరికా నివేదికను ఖండించిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో తీసుకొస్తున్న మత స్వేచ్ఛపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్-2023 నివేదికను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) గట్టిగా తిప్పికొట్టింది. బుధవారం విడుదలైన అమెరికా నివేదికలో మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను, ప్రార్థనా స్థలాలను కూల్చివేయడమూ ప్రతికూలంగా ఉందని అమెరికా నివేదిక అభిప్రాయపడింది. దానికి బదులిచ్చిన ఎంఈఏ 'ఇది పూర్తిగా పక్షపాతం, భారత సామాజిక పరిస్థితులపై వాస్తవ అవగాహన నివేదికలో లోపించిందని' స్పష్టం చేసింది. ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదికను గమనించాం. గతంలో మాదిరిగానే నివేదిక తీవ్రమైన పక్షపాతం కలిగి ఉంది. నివేదికలో భారత సామాజికతపై అవగాహన కనబడలేదు. ఫ్యాబ్రిక్, ఓటు బ్యాంకు కోసం జరిగిన పరిశీలన తరహాలో ఉంది. ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్టు ఉన్నందున తాము దాన్ని తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో నివేదిక తప్పుల తడకగా ఉందని, వాస్తవాలను పొందుపరచడంలో వైఫల్యం, పక్షపాత మార్గాల్లో విషయ సేకరణ, ఏకపక్షంగా అంచనా కట్టడం వంటి అంశాలతో కూడుకున్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది.

Advertisement

Next Story