ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ 'బడ్జెట్ సైకత శిల్పం'

by D.Reddy |   ( Updated:2025-02-01 04:22:16.0  )
ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ బడ్జెట్ సైకత శిల్పం
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ సర్కార్ 3.0.. ఇవాళ (ఫిబ్రవరి 1వ తేదీ) తమ తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను (Union Budget 2025) ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finace Minister Nimala Sitharaman) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో తెలుగింటి కోడలు నిర్మలమ్మ రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా 8వ సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్ర సృషించారు.

ఈ సందర్భంగా ఒడిశాలోని పూరి తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ' వెల్‌కం యూనియన్ బడ్జెట్ 2025' (Welcom Union Budget 2025) అని నిర్మలా సీతారామన్ సైకతాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ సైకత శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా, సుదర్శన్ పట్నాయక్ గతంలో కూడా విశేషమైన రోజుల్లో ఇలా ఎన్నో సైకతాలను రూపొందించారు.

ఇక అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి పి.చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ (8 సార్లు) మూడో స్థానంలో ఉండగా.. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆయన సరసన నిలవనున్నారు. ఇక ఇవాళ నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, మధ్య తరగతి వర్గాలు, వేతన జీవులు, పారిశ్రామిక వేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Advertisement
Next Story