Immigration: యూఎస్ సహకారంతో అక్రమ వలసలకు అడ్డుకట్ట.. ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

by vinod kumar |
Immigration: యూఎస్ సహకారంతో అక్రమ వలసలకు అడ్డుకట్ట.. ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికాతో కలిసి పని చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ(MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Ranadheer Jaiswal) తెలిపారు. త్వరలోనే వీటికి ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. ప్రతి వారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అక్రమ వలసలను తగ్గించడానికి యూఎస్, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతర సహకారాన్ని కొనసాగించడానికి ఎంఈఏ కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా రెగ్యులర్‌గా కాన్సులర్ డైలాగ్, సమావేశాల ఏర్పాట్లు, యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న వారి తరలింపును సులభతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొంత కాలం పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, యూఎస్ సహకారంతో అక్రమ వలసలను నియంత్రించగలమని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య భారత్ నుంచి వెళ్లిన1,100 మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed