పూణే కారు ప్రమాద నిందితుడి కుటుంబ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలు ధ్వంసం

by Harish |
పూణే కారు ప్రమాద నిందితుడి కుటుంబ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలు ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పూణేలో 17 ఏళ్ల మైనర్ పోర్షే కారును వేగంగా నడిపి ఇద్దరు ఐటీ ఉద్యోగుల మరణానికి కారణం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కుటుంబానికి చెందిన రిసార్ట్‌లో అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు ధ్వంసం చేశారు. ఆ బాలుడు తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి, అలాగే పలు వ్యాపారాలు సైతం నిర్వహిస్తున్నాడు. బాలుడు కుటుంబానికి మహారాష్ట్ర, సతారా జిల్లా మహాబలేశ్వర్‌లోని మల్కం పేట్ ప్రాంతంలో ఎంపీజీ అనే పేరుతో ఒక రిసార్ట్ ఉంది. దీనిలో అనధికారిక నిర్మాణాలను అధికారులు శనివారం కూల్చివేశారు.

రిసార్ట్‌లో నిర్మించిన కట్టడాలకు ఎలాంటి అనుమతి లేదని అధికారులకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సైతం ఈ అక్రమ నిర్మాణాలపై స్పందించారు, కట్టడాలపై విచారణ చేయాలని వాటిని అక్రమంగా నిర్మించినట్లుయితే వెంటనే చర్యలు తీసుకోవాలని సతారా కలెక్టర్ జితేంద్ర దూడీకి ఆదేశాలు జారీచేశారు. దీంతో అధాకారులు గత వారం, కూల్చివేతకు ముందు రిసార్ట్‌కు సీలు వేశారు. తర్వాత వాటిపై విచారణ చేపట్టగా వాటికి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు. మే 19 న మైనర్ మద్యం మత్తులో పోర్స్చే కారును నడిపి బైకును ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో బాలునితో పాటు అతన్ని కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు, తాతను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed