- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం: యూపీలో ఇద్దరు చైనీయుల అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనా పౌరులను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సిద్ధార్థనగర్‌లోని కక్రాహ్వా పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చైనీయులు నేపాల్‌కు చేరుకుని అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుండగా.. సహస్త్ర సీమ బల్(ఎస్ఎస్‌బీ) అధికారులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విచారించగా సరైన సమాధానం చెప్పక పోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని చైనాలోని సిచువాన్‌కు చెందిన జౌ పులిన్‌గా, మహిళను చైనాలోని చాంగ్‌కింగ్‌కు చెందిన యువాన్ యుహాన్‌గా గుర్తించారు. వీరిద్దరి వద్ద నుంచి రెండు చైనా పాస్‌పోర్ట్‌లు, నేపాల్‌కు టూరిస్ట్ వీసా, మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీయుల చట్టం 1946లోని సెక్షన్ 14(A) కింద స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అనంతరం కోర్టులో హాజరుపర్చినట్టు తెలుస్తోంది. దీనిపై చైనా రాయబార కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.