ఆ ఆలయానికి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే..

by samatah |
ఆ ఆలయానికి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే..
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. జీన్స్‌, షార్టులు, స్లీవ్‌లెస్‌ డ్రెసులు ధరిస్తే టెంపులోకి అనుమతించబోమని తెలిపింది. ఈ నిబంధనలు సోమవారం(జనవరి 1) నుంచే అమలులోకి వచ్చాయి. కాబట్టి ఇక నుంచి ఆలయంలోని వచ్చే భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని అధికారులు వెల్లడించారు. దర్శనానికి వచ్చే వారు సాధారణ దుస్తులు మాత్రమే ధరించాలని స్పష్టం చేశారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు ఉంటాయని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం (ఎస్‌జేటీఏ) హెచ్చరించింది. డ్రెస్ కోడ్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని స్థానిక హోటళ్లను ఆదేశించింది. అంతేగాక ఆలయ పరిసరాల్లో గుట్కా, పాన్ నమలడం, ప్లాస్టిక్ సంచుల వాడకంపైనా నిషేధం విధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజు ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్టు పోలీసులు తెలిపారు. కాగా, డ్రెస్ కోడ్ నిబంధనలు అమల్లోకి రావడంతో పురుషులు దోతీల్లో, మహిళలు చీరలతో కనిపించడం గమనార్హం.

Advertisement

Next Story