- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
దిశ, నేషనల్ బ్యూరో: ముంబైకి చెందిన ఐఏఎస్ దంపతుల 27 ఏళ్ల కుమార్తె లిపి ఆత్మహత్య చేసుకుంది. సౌత్ ముంబైలోని పదో ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తెల్లవారుజామున 4 గంటలకు మహారాష్ట్ర సెక్రటేరియేట్ దగ్గరలోని సురుచి అపార్ట్ మెంట్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. తీవ్రగాయాలపాలైన లిపిని హుటాహుటిన స్థానిక జీటీ హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
సూసైడ్ నోట్ లభ్యం
హర్యానాలోని సోనిపట్ లో లిపి న్యాయవిద్య అభ్యసిస్తుంది. గత కొంతకాలంగా అకాడమిక్స్ గురించి ఆందోళన చెందుతున్నట్లు పోలీసులు తెలిపారు. దాని వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. లిపి గదిలో సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉంది. కఫే పరేడ్ పోలీస్ స్టేషన్ లో అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే, లిపి తండ్రి మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు, 2017లో మహారాష్ట్ర కేడర్ ఐఎఎస్ దంపతుల కుమారుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. మిలింద్, మనీషా మహీస్కర్ దంపతుల 18 ఏళ్ల కుమారుడు ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.