నిన్నటి ప్రమాదంలో 'నేను చనిపోయే దాన్ని': బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

by Mahesh |   ( Updated:2024-01-25 02:17:59.0  )
నిన్నటి ప్రమాదంలో నేను చనిపోయే దాన్ని: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారుకు జరిగిన ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం. బుర్ద్వాన్ నుండి కోల్‌కతాకు రోడ్డు మార్గంలో తిరిగి వస్తుండగా చోటు చేసుకుంది. దీంతో మమత తలకి స్వల్ప గాయం అయింది. కాగా ఈ ప్రమాదం అనంతరం ఆమె కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఈ ప్రమాదంలో తాను చనిపోవాల్సి ఉంది కానీ.. ప్రజల ఆశీర్వాదం వల్ల తాను సురక్షితంగా బయటపడ్డాను. ఈ ప్రమాదంపై పోలీసులు, చట్టం తన పని తాను చేస్తుందని ఆమె తెలిపింది.

అలాగే ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ, బెనర్జీ ముందు నుండి కారు వచ్చి తన వాహనాన్ని దాదాపుగా ఢీకొట్టిందని చెప్పారు. ఆ సమయంలో కారు విండో తెరిచి ఉంది అందుకే నేను బ్రతక గలిగానని చెప్పుకొచ్చింది. అలాగే.. ఈ పరిస్థితుల్లో కూడా మేము.. విద్యారంగంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేం సమావేశమయ్యామని గుర్తు చేసింది. అలాగే తన తలకు గాయం అయిందని తనకు నొప్పి, చలిగా ఉందని ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకంటానని మీడియతో చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.

Advertisement

Next Story