- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Heroin seize: రూ.14 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం.. ఎక్కడంటే?
దిశ, నేషనల్ బ్యూరో: అండమాన్ నికోబార్ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. భారీ హెరాయిన్ నెట్ వర్క్‌ను ఛేదించారు. 2.075 కిలోల బరువున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సౌత్ అండమాన్ ఎస్పీ నిహారక భట్ గురువారం వెల్లడించారు. ఓ వ్యక్తి వద్ద భారీగా హెరాయిన్ ఉందని గత నెల 24న పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో పక్కా సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి 1.295 కేజీల హెరాయిన్ గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టగా.. మరో ముగ్గురి గురించిన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతాలో జరిపిన సోదాల్లో 798 గ్రాముల హెరాయిన్ లభ్యమైంది. మొత్తంగా సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.14కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.