- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హేమంత్ సోరెన్ కు మరో షాక్.. ఐదు రోజుల ఈడీ కస్టడీ
దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు చుక్కెదురైంది. హేమంత్ సోరెన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా సోరెన్ పదిరోజుల కస్టడీ కోరుతూ ప్రత్యేక న్యాయస్థానాన్ని గతంలోనే ఆశ్రయించింది ఈడీ. ఐదురోజులపాటు హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీకి అనుమతించింది ప్రత్యేక కోర్టు. రూ.600 కోట్ల భూకుంభకోణంలో హేమంత్ పాత్ర ఉందని.. వచ్చిన డబ్బుని వినియోగించారని ఈడీ ఆరోపించింది.
మరోవైపు ఈడీ అధికారులు తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టున ఆశ్రయించారు సోరెన్. ఆ కేసులో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టుని ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచనలు చేసింది. ఇప్పటికే రిట్ పిటిషన్ హైకోర్టులో ఉందని.. త్వరగా లిస్టింగ్ చేసి పరిష్కారం కోరవచ్చని సుప్రీం తెలిపింది.
హేమంత్ సోరెన్‌ను జనవరి 31న అర్థరాత్రి అరెస్టు చేశారు. ఫిబ్రవరి 1న రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు అతడిని ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కాగా హేమంత్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆయన కస్టడీని ఐదురోజులకు పొడిగించింది.