ఆ 4 రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు.. పోలింగ్ తగ్గిపోనుందా?

by Dishanational6 |
ఆ 4 రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు.. పోలింగ్ తగ్గిపోనుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే తొలిదశ ఓటింగ్ ముగిసింది. మరుసగా హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఆశపడుతుండగా.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి రసవత్తర ఎన్నికల ఓటింగ్ పై ఉష్ణోగ్రతలు ప్రభావం చూపించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 26 రెండో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి. హీట్ వేవ్ కారణంగా పోలింగ్ తగ్గే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఆందోళ చెందుతుంది. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో ఎండ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తోంది.

అయితే, తొలిదశ పోలింగ్ జరిగిన చోట 65.5 శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో అదే నియోజకవర్గాల్లో 69.9 శాతం పోలింగ్ జరిగింది. గతంలో పోలిస్తే.. 4.4 శాతం తగ్గుదల కనిపించింది. ఇక, ఎండల దష్ట్యా ఎన్నికల పోలింగ్ పై ప్రతికూల ప్రభావం పడే అకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తుంది.

హీట్‌వేవ్ హెచ్చరికల దృష్ట్యా కేంద్ర ఎన్నకల సంఘం అప్రమత్తమైంది. ఇంకా ఆరు దిశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు సమావేశం అయ్యారు. తాజా పరిస్థితులను తెలుసుకున్నారు. ఇక అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కూడా రాజీవ్ కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో తాగునీరు, ఫ్యాన్‌ల వంటి అవసరమైన సౌకర్యాలను పరిశీలించడానికి రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. ఆ తర్వాత మే 7, 13, 20, 25, జూన్ 1న పలు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి.



Next Story

Most Viewed