- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఒక్కరోజే 1,300 కొత్త కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 140 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది. ఇక తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 7,605కు చేరింది. వైరస్ బారిన పడి ముగ్గురు మరణించారు. కొత్త కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4.46 కోట్లు దాటింది. అదే సమయంలో 5,30,816 మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు రోజు వారి కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు 5 అంచెల వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం సూచించింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధత వంటి వాటిపై దృష్టి సారించాలని పేర్కొంది. మరోసారి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటనలో పేర్కొంది. ప్రికాషన్ డోసులు పెంచుతామని.. ల్యాబ్ పర్యవేక్షణ, పరీక్షలపై దృష్టి సారిస్తామని తెలిపింది. కాగా ఇప్పటివరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో 220.65 కోట్లకు పైగా డోసులను అందించారు.