హత్రాస్ తొక్కిసలాట.. సత్సంగ్ నిర్వహణ కమిటీదే బాధ్యత

by Shamantha N |
హత్రాస్ తొక్కిసలాట.. సత్సంగ్ నిర్వహణ కమిటీదే బాధ్యత
X

దిశ, నేషనల్ బ్యూరో: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ కొనసాగిస్తుంది. కాగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ నివేదికను సమర్పించింది. 'సత్సంగ్' నిర్వహించిన కమిటీయే ఘటనకు బాధ్యత వహించాలన సిట్ నివేదికలో పేర్కొంది. కమిటీ అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మందిని ఆహ్వానించిందని ఆఱోపించింది. తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యిందని.. అనుమతి ఇచ్చిన అధికారులు స్థల పరిశీలన చేయలేదని తెలిపింది. దాదాపు 300 పేజీల నివేదికలో మృతుల కుటుంబ సభ్యులు, గాయపడిన భక్తులతో సహా 119 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది.

హత్రాస్ తొక్కిసలాట

సత్సంగ్‌కు అనుమతి ఇచ్చిన హత్రాస్ డీఎం ఆశిష్ కుమార్, ఎస్పీ నిపున్ అగర్వాల్ సహా పలువురు సిబ్బంది నుంచి సిట్ వాంగ్మూలాలు నమోదు చేసింది. జూలై 2న హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం జరిగింది. ఆ భోలే బాబా పాదాల కింది ధూళినిసేకరించేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 121 మంది చనిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, సత్సంగ్ నిర్వహించిన దేవప్రకాష్ మధుకర్ ను శనివారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. నిందితుడిని పోలీసులు 14 రోజుల కస్టడీకి పంపారు.



Next Story