- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Israel- Hamas: ముగ్గురు బందీలను విడుదల చేసిన హమాస్

దిశ, నేషనల్ బ్యూరో: గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్, ఇజ్రాయెల్(Israel-Hamas) మధ్య ఖైదీల విడుదల క్రమంగా జరుగుతోంది. అందులో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్ (Hamas) రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36), అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ముగ్గురిని విడుదల చేయడంతో.. ఇజ్రాయెల్ 369 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది. అయితే, వీరి విడుదలతో ఇప్పటివరకు 21 మందిని హమాస్ విడుదల చేయగా.. 730 మంది పాలస్తీనా ఖైదీలకు టెల్ అవీవ్ విముక్తి కల్పించింది.
హమాస్ ఆరోపణలు
అయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని హమాస్ ఆరోపిస్తుంది. బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపైన ఇజ్రాయెల్ సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. ఈ వారాంతంలో తమ బందీలను విడుదల చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో, ఇజ్రాయెల్ హెచ్చరికలకు తగ్గిన హమాస్.. బందీల విడుదలకు అంగీకరించింది. ఖతర్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా.. హమాస్ చెరలోని 94 మంది బందీల్లో 33 మందిని విడుదల చేయనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.