రైతులకు గొప్ప శుభవార్త!.. నిధుల విడుదలకు తేదీ ఖరారు

by Ramesh Goud |
రైతులకు గొప్ప శుభవార్త!.. నిధుల విడుదలకు తేదీ ఖరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ నిధులు జూన్ 18 తేదీన ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి సంబందించిన వివరాలు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు అందించే సాయం 17 విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ నెల 18 తేదీన ప్రధాని మోడీ వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు.

దీంతో ఈ పథకం దేశంలోని రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ కానున్నాయి. మోడీ ప్రధాని గా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు తొలి సంతకం పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదల పైనే పెట్టారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి రూ. 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్లు చౌహన్ పేర్కొన్నారు. దీంతో ప్రతిఏటా 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం చేకూరుతోంది.

Advertisement

Next Story

Most Viewed