Coaching Centres: కోచింగ్ సెంటర్ల తప్పుడు ప్రకటనలు.. కొత్త మార్గదర్శకాలు తెచ్చిన కేంద్రం

by Shamantha N |
Coaching Centres: కోచింగ్ సెంటర్ల తప్పుడు ప్రకటనలు.. కొత్త మార్గదర్శకాలు తెచ్చిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: కోచింగ్‌ సెంటర్లు(Coaching Centres) తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్‌ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్‌ గ్యారెంటీ, సెలెక్షన్‌ పక్కా వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ (CCPA)కు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం తెలిపింది. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ‘‘తమ సక్సెస్‌ రేటు, సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సులు మొదలైన విషయాల గురించి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తున్నారని గమనించాం. అందుకే కోటింగ్ సెంటర్ల నిర్వహాకుల నుంచి పలు మార్గదర్శకాలు రూపొందించాం’’ అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు.

కోచింగ్ సెంటర్లపై..

కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే ప్రకటనలు మాత్రం యూజర్స్ హక్కులను దెబ్బతీయొద్దని నిధి ఖరే పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి ఇప్పటికే జరిమానాలు విధించామని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. కోచింగ్‌ సెంటర్లు అందించే కోర్సులు, వాటి వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయవద్దన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారి నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్‌లు వారి పేర్లు, ఫొటోలు ఉపయోగించవద్దన్నారు. కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలని సూచించారు. చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని.. అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed