గోధుమల నిల్వ పరిమితిని మరింత తగ్గించిన కేంద్రం

by S Gopi |
గోధుమల నిల్వ పరిమితిని మరింత తగ్గించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉల్లి, గోధుమ నిల్వలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, తాజాగా గోధుమల నిల్వ పరిమితిని మరింత తగ్గించింది. కృత్రిమ కొరతను సృష్టించి అక్రమంగా ధరలను పెంచే ప్రయత్నాలను అరికట్టడం కోసం రిటైల్, టోకు వ్యాపారుల వద్ద గోధుమ నిల్వలపై పరిమితిని గతంలో 1,000 టన్నుల నుంచి 500 టన్నులకు తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గోధుమ స్టాక్ పరిమితి గురించి ప్రభుత్వ పోర్టల్‌లో గోధుమలను నిల్వచేసే సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం స్టాక్ నిల్వల స్థితిని అప్‌డేట్‌ చేయాలి. పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోని, స్టాక్ పరిమితులను ఉల్లంఘించినట్టు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని' ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒకవేళ సంస్థల వద్ద ఉన్న స్టాక్ నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోగా పరిమితి స్థాయికి తీసుకురావాలని స్పష్టం చేసింది. దేశంలో గోధుమలకు కృత్రిమ కొరత ఏర్పడకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ స్టాక్ పరిమితుల అమలును నిశితంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story