Priyanka Gandhi: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల గురించి ప్రభుత్వం గళం విప్పాలి

by S Gopi |
Priyanka Gandhi: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల గురించి ప్రభుత్వం గళం విప్పాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హిందూ, క్రిస్టియన్ మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని, చర్చలు జరిపి బంగ్లాదేశ్ ప్రభుత్వ మద్దతు తీసుకోవాలన్నారు. విజయ్ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో పోరాడిన సైనికులకు నివాళులర్పించిన ప్రియాంక గాంధీ, యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వ తీరును ప్రశంసించారు.బంగ్లాదేశ్‌లో ఏం జరిగినా మన బెంగాలీ సోదరుల గొంతును ఎవరూ వినలేదు. ఆ సమయంలో ఇందిరా గాంధీ క్లిష్ట పరిస్థితుల మధ్య ధైర్యంగా దేశానికి విజయాన్నందించారని చెప్పారు. ఇదే సందర్భంలో న్యూఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ నుంచి 'ఐకానిక్ 1971 సరెండర్ పెయింటింగ్ 'ను తొలగించడంపై ప్రియాంకా గాంధీ ఘాటుగా స్పందించారు. భారత సైన్యం ముందు పాకిస్తాన్ సైన్యం లొంగిపోతున్న ఫోటోను ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి తొలగించారన్నారు. బంగ్లాదేశ్‌లో దాడులకు సంబంధించి స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, దాడులు జరగకుండా నివారించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే నమ్మకం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed