- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajasthan: 700 అడుగుల బోరుబావిలో పడిన బాలిక.. హుక్ టెక్నిక్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని(Rajasthan) బెహ్రార్(Behror) జిల్లాలో మూడేళ్ల బాలిక బోరుబావిలో(Girl stuck in borewell) పడిపోయింది. దాదాపు 20 గంటల నుంచి చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ టీ ప్రయత్నిస్తోంది. సోమవారం సరుంద్ ప్రాంతంలోని తన తండ్రి పొలంలో ఆడుకుంటున్న బాలిక 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 150 అడుగుల దగ్గర ఇరుక్కుపోయింది. దీంతో బాలికను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్(rescue team) రంగంలోకి దిగాయి. బాలిక కదలికలను కూడా కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ సప్లయ్ చేసేందుకు పైపులను బోర్ వెల్ లోకి దించారు.అయితే, 19 గంటల పాటు సంప్రదాయ పద్ధతుల ద్వారా చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలు బాలికను బయటకు తీయడానికి 'హుక్ టెక్నిక్'ని అమలు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ కొత్త టెక్నిక్ ప్రకారం, రెస్క్యూ టీమ్‌లు రాడ్‌కు జోడించిన హుక్ సహాయంతో చిన్నారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాయి.
రాతపూర్వక అనుమతి
సంప్రదాయపద్ధతిలో బాలికను బయటకు తీయాలంటే సుమారు వారం పడుతుంది. దీంతో హుక్ టెక్నిక్ ద్వారా చిన్నారిని బయటకు తెచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. హుక్ టెక్నిక్ ని ఉపయోగించేందుకు చిన్నారి తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకున్నారు. ఈ ప్రక్రియలో ఆమె గాయపడితే రెస్క్యూ టీంని బాధ్యులుగా చేయరని అందులో ఉంది. కాగా.. రాజస్థాన్ లో ఇలాంటి ఘటన జరగడం ఈ నెలలోనే ఇది రెండోసారి. అంతకుముందు, దౌసా జిల్లాలో ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. 55 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినప్పటికీ బాలుడిని రక్షించలేకపోయారు.