Wayanad landslide: వయనాడ్‌ సహాయక చర్యలను మోడీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: జార్జ్ కురియన్

by Harish |
Wayanad landslide: వయనాడ్‌ సహాయక చర్యలను మోడీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: జార్జ్ కురియన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ బుధవారం తెలిపారు. విషాదంలో నష్టపోయిన వారి సహాయ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయాన్ని అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడి ప్రభావిత ప్రాంతాల ప్రజలను కురియన్ పరామర్శిస్తున్నారు. వయనాడ్‌‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ సహాయక చర్యల గురించి తెలుసుకుంటున్నారు. ఇక్కడి ప్రాంతాలను సందర్శించడానికి నన్ను నియమించారని చెప్పారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెండు కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కేరళ ప్రభుత్వంతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. వారికి అన్ని విధాల సహాయం చేస్తున్నామని జార్జ్ కురియన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. మరోవైపు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అదనంగా NDRF బృందాలను పంపుతున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే, రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్‌లను కూడా మోహరించారు. ఇప్పటికే అక్కడ ఆర్మీ, NDRF, నేవీ, రాష్ట్ర పోలీసు, అటవీ శాఖకు చెందిన 500 నుండి 600 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానిక వాలంటీర్లు పనిచేస్తున్నారు.

Advertisement

Next Story