- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ganga Aarti: మహాకుంభమేళాలో రద్దీ.. యూవద్ద గంగా హారతి నిలిపివేత

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Maha kumbh mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాది మంది కుంభమేళాకు తరలివస్తుండగా తీవ్రమైన రద్దీ నెలకొంది. దీంతో కొన్ని రోజుల పాటు ఘాట్‌ల వద్ద గంగా హారతి (Ganga Aarti) కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 5 వరకు వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్‌లలో నిర్వహించే గంగా హారతిని నిలివేస్తున్నామని వెల్లడించారు. స్థానిక ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ కోరారు. ఘాట్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మౌని అమావాస్య నుంచి భక్తుల రద్దీ పెరిగిందని.. అప్పటివరకు ఎవరూ వారణాసికి రావద్దని కోరారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన భక్తులు వారణాసికి కూడా వస్తుండటంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వేస్టేషన్లలో చిక్కుకుపోయారు. దీంతో, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ కాస్తున్నట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. ఇకపోతే, మౌని అమావాస్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. దీంతో, రద్దీ నియంత్రణకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కుంభమేళా ప్రాంతంలోకి రాకపోకలపై నిషేధం విధించింది. వీవీఐపీ, స్పెషల్ పాసులు రద్దు చేసింది. పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తుంది. భక్తుల కోసం వన్ వే ట్రాఫిక్ వ్యవస్థను తీసుకొచ్చారు. కాగా.. ఇప్పటివరకు దాదాపు 30 కోట్ల మంది కుంభమేళాను సందర్శించినట్లు తెలుస్తోంది.
ఘాజీపూర్ లో ప్రమాదం
ఘాజీపూర్‌లో (Ghazipur) మహాకుంభమేళాకు వెళ్లి తిరిగివస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులతో వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి. యాక్సిడెంట్ టైంలో వాహనంలో 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నంద్‌గంజ్ పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఘాజీపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.