- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ కఠిన నిర్ణయాల వల్లే ఉగ్రవాదం, మావోయిజం నుంచి విముక్తి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లే ఉగ్రవాదం, మావోయిజం, అవినీతి నుంచి దేశం విముక్తి పొందిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. బ్రిటిష్, మొఘలుల కాలం నుంచి దేశంలో ఉన్న బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి మోడీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. అత్యంత కఠిన నిర్ణయాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. బీజేపీ పాలనలోని గత దశాబ్దకాలం సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, సీఏఏ వంటి నిర్ణయాలు ఎంతో సాహసంతో కూడుకున్నవని వెల్లడించారు. 400 సీట్లు దాటాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి బీజేపీ కార్యర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోడీ తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి చెందిన భారత్ వాగ్డానాన్ని కూడా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, 2014, 2019లో వారణాసిలో గెలిచిన ప్రధాని మోడీ మూడోసారి కూడా అదే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.