వనరులున్నా అడ్డుకుంటున్నారు.. సొంత జిల్లా నేతలపై మంత్రి అచ్చెన్న సంచలన ఆరోపణలు

by srinivas |
వనరులున్నా అడ్డుకుంటున్నారు.. సొంత జిల్లా నేతలపై మంత్రి అచ్చెన్న సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: సొంత జిల్లా శ్రీకాకుళం(Srikakulam) అభివృద్ధి చెందకపోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వనరులున్నా ఉద్యమాలతో కొందరు అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రాజెక్టు చేపడతామంటే జెండాలు తీసుకుని వచ్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడతామంటే వద్దంటున్నారని, పాజిటివ్ మైండ్ లేదని మండిపడ్డాయి. పాజిటివ్ గా ఆలోచించకపోతే మరో 75 ఏళ్లు అయినా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందదన్నారు. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పీ4 విధానంపై అవగాహన లేనందు వల్లే విమర్శలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పేదలు ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు పీ4 విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. ధనవంతులు సాయం చేస్తే ఆర్థికంగా పేదలకు చాలా ఉపయోగపడుతుందన్నారు. పీ4 విధానం ప్రతి ఒక్కరికి తెలియాల్సి అవసరం ఎంతైనా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు.



Next Story

Most Viewed