Uthappa: ధోని కెప్టెన్ అయితే ఏంటి... CSK ను దేవుడు కూడా కాపాడలేడు!

by Veldandi saikiran |
Uthappa: ధోని కెప్టెన్ అయితే ఏంటి... CSK ను దేవుడు కూడా కాపాడలేడు!
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై కొత్త కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ( Ms Dhoni) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa ). ధోనీకి కొత్తగా కెప్టెన్సీ ఇస్తే ఏంటి...? ఆ భగవంతుడు దిగివచ్చినా చెన్నై సూపర్ కింగ్స్ ను ( CSK ) గెలిపించలేడని సెటైర్లు పిలిచాడు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa ). గురువారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ని మరోసారి నియామకం చేసింది. రుతురాజు గైక్వాడ్ కు ( Ruturaj Gaikwad ) తీవ్ర గాయం అయిందని తెలుస్తోంది.

దీంతో రుతురాజు గైక్వాడ్ స్థానంలో.. మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అధికారిక ప్రకటన చేశారు. అయితే చెన్నై కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని మరోసారి నియామకం టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధోని చెన్నై కెప్టెన్ అయినంత మాత్రాన ఆ జట్టు రాత మారదని హాట్ కామెంట్స్ చేశారు ఉతప్ప. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎన్నో సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ సమస్యలన్నిటిని ముందుగా సరిదిద్దుకోవాలని కోరారు. ఆ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత చెన్నై విజయాలు సాధించడం ఖాయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు చెన్నై ని ఆపే దమ్ము ధైర్యం ఏ జట్టుకు ఉండదని కూడా స్పష్టం చేశారు రాబిన్ ఉతప్ప.

Next Story

Most Viewed