Israeli Hostage: హమాస్ సభ్యుల నుదుటిపై ముద్దు పెట్టిన ఇజ్రాయెలీ బందీ

by Shamantha N |
Israeli Hostage: హమాస్ సభ్యుల నుదుటిపై ముద్దు పెట్టిన ఇజ్రాయెలీ బందీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్, ఇజ్రాయెల్(Israel-Hamas) మధ్య ఖైదీల విడుదల జరిగింది. తుదివిడతలో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించింది. ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు ఒమర్ వెంకర్ట్, ఒమర్ షెమ్ టోవ్, ఎలియా కోహెన్ లకు విముక్తి కల్పించారు. దాదాపు 505 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి వారు విడుదలయ్యారు. నుసీరాత్ సిటీలో రెడ్ క్రాస్ అధికారులకు వారిని అప్పగించే ముందు వారు ముగ్గురు కవాతు నిర్వహిస్తూ.. విడుదల సర్టిఫికెట్లను పట్టుకున్నారు. ఇజ్రాయెల్ బందీ అయిన ఒమర్ షెమ్ టోవ్ వేదికపై చేతులు ఊపుతూ ఇద్దరు హమాస్ సభ్యుల నుదిటిపై ముద్దు పెట్టారు. ఆ తర్వాత రెడ్ క్రాస్ కాన్వాయ్ తరువాత బందీలను వేడుక నుండి తీసుకెళ్లింది.

ఒమర్ చర్యపై స్పందించిన అతడి తండ్రి

కాగా.. ఒమర్ చర్యపై అతడి తండ్రి మల్కి షెమ్ టోవ్ స్పందించారు. విడుదల సమయంలో తన కొడుకు సంతోషకరమైన ప్రవర్తన అతని వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు. మల్కి మాట్లాడుతూ.. "ఒమర్ సన్నగా ఉంటాడు... కానీ అతను ఉత్సాహంగా ఉంటాడు. అతతడు ప్రపంచంలోనే అత్యంత సానుకూల దృక్పథం కలిగినవాడు. విడుదలయ్యే వరకు అతడు ఎలా ఉంటాడో మాకు తెలీదు. అతడు బయటకు వచ్చాక చిరునవ్వుతో మా అందర్నీ ఆశ్చర్యపరిచారు. అతను అందరితోనూ బాగా కలిసిపోతాడు. హమాస్ కూడా అలానే కలిసిపోయాడు. అక్కడి వాళ్లు కూడా అతడ్ని ప్రేమిస్తారు" అని అతను చెప్పాడు.

Next Story

Most Viewed