- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏజెన్సీల పేరుతో మోసం..గోవాలో ఏడుగురు నిందితుల అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: ఫేక్ కాల్ సెంటర్ ద్వారా అమెరికా పౌరులను మోసం చేసిన ఏడుగురు నిందితులను గోవా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరంతా ఉత్తర గోవాలోని కలాంగుట్‌లోని ఒక హోటల్ గది నుంచి నకిలీ కాల్ సెంటర్‌ను నడుపుతున్నారని సైబర్ క్రైమ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ గుప్తా తెలిపారు. నిందితులు లోన్ కంపెనీలు, అమెజాన్ హెచ్‌క్యూ సిబ్బంది, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర ఏజెన్సీల ఏజెంట్లుగా చెలామని అయ్యేవారు. దీని ద్వారా అమెరికాకు చెందిన పలువురు పౌరులను మోసం చేశారు. వారితో కాల్స్ మాట్లాడి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడానికి ప్రోత్సహించారు. దీంతో పలువురి ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టి పోలీసులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని గుజరాత్, నాగాలాండ్, రాజస్థాన్, అసోంలకు చెందిన వారిగా గుర్తించారు. హోటల్ గదిలో ఉన్న నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఒక టీపీ-లింక్ రూటర్ స్వాధీనం చేసుకున్నారు.