- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral Video : సినిమా కాదు గురూ... షాకింగ్ పోలీస్ - గ్యాంగ్‌స్టర్స్ చేజింగ్ విజువల్స్

దిశ, వెబ్ డెస్క్ : పోలీసులు వెంబడిస్తుంటే విలన్లు కార్లలో పారిపోతుండటం, వారిని పోలీసులు ఛేజ్ చేయడం, చివరికి విలన్లు తప్పించుకోవడమో, లేదంటే పోలీసుల చేతిలో హతమవడమో లాంటి ఘటనలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ తాజాగా ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని షామ్లీ జిల్లా(Shamli district)లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పారిపోతున్న దుండగులను పోలీసులు ఛేజ్ చేసి కాల్చిచంపారు. వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్ ముస్తఫా కగ్గా ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నట్లు మంగళవారం ఉదయం స్పెషల్ టాస్క్‌ఫోర్స్(STF) పోలీసులకు సమాచారం అందింది. దాంతో మాటువేసి ఆ దుండగులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను పసిగట్టిన దుండుగులు కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎస్టీఎఫ్ పోలీసులు వారిని సినీ ఫక్కీలో వెంబడించారు. షామ్లీ జిల్లాలోని ఝిన్‌ఝనా ఏరియాలో వారి వాహనాన్ని చుట్టుముట్టారు. దుండుగులు పోలీసులపై కాల్పులకు ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ ముస్తఫా ముఠాకు చెందిన అర్షద్, మంజీత్, సతీష్‌తోపాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఎస్టీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.