- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతిపక్షాలకు షాక్.. రైల్వే మంత్రిపై మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశంసలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జరిగిన నష్టం నుండి ట్రాక్స్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రి అన్ని చర్యలు తీసుకున్నారని కితాబిచ్చారు. అశ్విని వైష్ణవ్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాడని.. మంత్రిగా ఆయన తన సత్తా ఏంటో చాటుకున్నారని ఇలాంటి దశలో రాజీనామా చేయాలని అతడిపై ఒత్తిడి తేవడం తెలివైన పని కాదని అన్నారు. ప్రమాదంపై విచారణ పూర్తి చేయనివ్వాలని సూచించారు.
కాగా, ఈ ఘటనకు బాధ్యతగా అశ్వనీ వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ మంత్రికి మాజీ ప్రధాని బాసటగా నిలవడం ఆసక్తిగా మారింది. మరో వైపు ఈ ప్రమాదం ఘటన కేసును సీబీఐకి అప్పగించడంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. వార్తల్లో హెడ్ లైన్స్ కోసమే సీబీఐకి ఈ కేసును అప్పగించారంటూ దుయ్యబడుతోంది. ఇప్పటికే ఈ ప్రమాదంపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ బృందం దర్యాప్తు చేస్తుండగా.. దీనికి సమాంతరంగా సీబీఐ సైతం దర్యాప్తు చేపడుతోంది. ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని ఈ దర్యాప్తు సంస్థ అధికారులు పరిశీలించారు.