అవసరమైతే కాల్చేస్తాం.. ఎక్కడికి రావాలి.. బుల్లెట్ దింపుకుంటాం!

by Harish |
అవసరమైతే కాల్చేస్తాం.. ఎక్కడికి రావాలి.. బుల్లెట్ దింపుకుంటాం!
X

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లపై కేరళ మాజీ డీజీపీ ఎన్.సి.అస్థానా సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘పార్లమెంట్ కు మార్చ్ నిర్వహించిన రెజ్లర్లను పోలీసులు చెత్త కుండీలా లాగి పడేశారు. అవసరమైతే షూట్ చేస్తాం. పోలీసుల హక్కును కొందరు మూర్ఖులు అనుమానిస్తున్నారు. ఇంగ్లీషు చదవగలిగితే అఖిలేష్ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును చదవండి. ఆర్టికల్ 129 ప్రకారం పోలీసులకు కాల్చే హక్కు ఉంది. సరైన సమయంలో ఆ కోరిక కూడా తీరుతుంది. మళ్లీ పోస్ట్ మార్టం టేబుల్ వద్ద కలుద్దాం. కారణం లేకుండా భార్యలు వితంతువులు, పిల్లలు అనాథలు అవుతారు! ఫిట్‌గా ఉండండి’’ అంటూ ఆదివారం రాత్రి అస్థానా ట్వీట్ చేశారు.

దీనిపై అంతే సీరియస్ గా స్పందించిన అంతర్జాతీయ రెజ్లర్ బజరంగ్ పూనియా “ఈ ఐపీఎస్ అధికారి మమ్మల్ని కాల్చి చంపడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా.. నేను బుల్లెట్ దింపుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి రావాలో చెప్పు. నేను వెన్ను చూపనని, నీ బుల్లెట్‌ను నా ఛాతీలోకి దింపేందుకు అవకాశం ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను’' అని హిందీలో ట్వీట్ చేశారు.

Advertisement

Next Story