మాజీ సీఎం సంచలన నిర్ణయం.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్

by Mahesh |   ( Updated:2024-03-21 06:23:00.0  )
మాజీ సీఎం సంచలన నిర్ణయం.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ సీఎం సదానందగౌడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీయాశీల రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, మైసూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వచ్చిన వార్తలపై కూడా స్పందించారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. నేను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని సదానందగౌడ చెప్పుకొచ్చారు. బెంగళూరు నార్త్‌ ఎంపీగా ఉన్న ఆయన బీజేపీ నుంచి బయకటు వెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో రెండు రోజుల క్రితం ఆర్‌.అశోక, సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ నేతృత్వంలోని సీనియర్‌ బీజేపీ నేతలు సదానందంను కలిసి పార్టీని వీడొద్దని కోరిన తర్వాత ఆయన ఈ రోజు తన రిటైర్మెంట్ ప్రకటన తెలిపారు. ఆయన రిటైర్మెంట్ తో పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి సవాల్ ఎదురయ్యే అవకాశం ఏర్పడింది.

Advertisement

Next Story