తొలిసారిగా లోక్‌సభకు 8 మంది మాజీ సీఎంలు

by Shamantha N |
తొలిసారిగా లోక్‌సభకు 8 మంది మాజీ సీఎంలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈసారి ఎన్నికల్లో 280 మంది లోక్ సభకు తొలిసారి ప్రాతినిథ్యం వహించనున్నారు. వారిలో మాజీ సీఎంలు, నటులు, రాజ్యసభ ఎంపీలు సహా హైకోర్టు మాజీ జడ్జి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు నారాయణ్ రాణే, త్రివేంద్ర సింగ్ రావత్, మనోహర్ లాల్ ఖట్టర్ ఈసారి ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందారు. మాజీ సీఎంలు విప్లబ్ కుమార్ దేబ్, జితన్ రామ్ మాంజీ, బసవరాజ్ బొమ్మై, జగదీష్ షెట్టర్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారిగా లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు.

ఎంపీలుగా రాజకుటుంబీకులు

అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 45 మంది తొలిసారిగా దిగువ సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యులు అనిల్ దేశాయ్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్ సుఖ్ మాండవీయా, పురుషోత్తం రూపాలా మొదటిసారిగా లోక్ సభ ఎంపీలుగా విజయం సాధించారు. రాజకుటుంబీకులు ఛత్రపతి షాహూ, యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, కృతిదేవి దెబ్బర్మన్ రాజకీయ అరంగేట్రం చేసి ఎంపీలుగా గెలుపొందారు. వీరేకాకుండా కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీ సాధించారు.

Advertisement

Next Story