లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ హస్తం..శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |
లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ హస్తం..శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు కోల్పోవడానికి విదేశీ శక్తుల జోక్యమే కారణమని బీజేపీ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. శనివారం జైపూర్‌లో జరిగిన రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘బీజేపీ ప్రత్యర్థుల్లో ప్రతిపక్షాలతో పాటు, విదేశీ శక్తులు కూడా ఉన్నాయన్నది నిజం. దేశంలో కాషాయ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని వారు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ ఎన్నికల ఇన్ చార్జి వినయ్ సహస్రబుద్ధే చౌహాన్ మాట్లాడుతూ కూడా ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య తగ్గడానికి దారితీసిన అంశాలలో విదేశీ ప్రమేయం ఒకటని తెలిపారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదే కావడం గమనార్హం. దాదాపు 8000 మంది బీజేపీ అధికారులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed