Farooq Abdullah: ఆ విషయంలో బంగ్లాదేశ్‌ను నిందించొద్దు.. ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

by vinod kumar |
Farooq Abdullah: ఆ విషయంలో బంగ్లాదేశ్‌ను నిందించొద్దు.. ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan)పై దాడి చేసిన నిందితుడు షరీఫుల్ బంగ్లాదేశ్‌ (Bangladesh)కు చెందిన వ్యక్తి అని పోలీసులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ఆ దేశంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ (NC) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. దాడికి పాల్పడింది బంగ్లా పౌరుడే అయినప్పటికీ ఒక వ్యక్తి చేసిన తప్పుకు దేశం మొత్తాన్ని నిందించలేమని తెలిపారు. జమ్మూలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక వ్యక్తి చేసిన చర్యకు దేశం మొత్తాన్ని నిందించొద్దని అది వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని దేశంపై కాదని స్పష్టం చేశారు. అమెరికాలోనూ అక్రమంగా వెళ్లిన భారతీయులున్నారని గుర్తు చేశారు. ఒక భారతీయుడు యూఎస్ లేదా కెనడాలో ఏదైనా తప్పు చేస్తే దానికి దేశాన్ని మొత్తం నిందిస్తామా? అని ప్రశ్నించారు. భారత్‌కు బయటి నుంచి కాకుండా లోపల నుంచే ముప్పు పొంచి ఉందన్నారు.

Next Story