Fangal Cyclone: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విమానానికి తప్పిన ముప్పు

by Ramesh Goud |   ( Updated:2024-12-01 02:14:16.0  )
Fangal Cyclone: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విమానానికి తప్పిన ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడ్డ ఫెంగల్ తుఫాన్(Cyclone Fangal) తీరం వెంబడి రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండటంతో తమిళనాడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు(Tamil Nadu)లోని ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి(IndiGo Flight) పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ఇండిగోకి సంబంధించిన విమానం సాఫ్ట్ ల్యాండింగ్(Soft Landing) చేయడం కష్టతరంగా మారింది. భారీగా వీస్తున్న ఈదురు గాలుల వల్ల ల్యాండింగ్ సమయంలో గాలిలోనే చక్కర్లు కొట్టింది. దీంతో పైలట్ అప్రమత్తమై సేఫ్ ల్యాండ్ చేసేందుకు కొంత సమయం తీసుకొని సురక్షితంగా కిందికి దించారు. కాగా ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెన్నైకి రెడ్ అలర్ట్ ప్రకటించగా.. పలు ప్రాంతాలు పూర్తిగా వరద ముంపులో చిక్కుకునన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై ఎయిర్‌పోర్టు(Chennai Airport) నుంచి పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ సంస్థలు ప్రకటిస్తున్నాయి.

Advertisement

Next Story