Air Pollution : ఒక్క నెలలో 18 లక్షల మందికి అస్వస్థత.. కారణం ఇదే!

by M.Rajitha |
Air Pollution : ఒక్క నెలలో 18 లక్షల మందికి అస్వస్థత.. కారణం ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆ దేశంలో కేవలం ఒక్క నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. ఇది ఎక్కడో కాదు మన పొరుగు దేశం పాకిస్థాన్(Pakisthan) లోనే జరిగింది. వాతావరణ కాలుష్యం(Air Pollution) వలన ఒక్క నెలలోనే భారీగా జనాలు ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం కలిగిన ప్రాంతంగా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్(Punjab Province) నిలిచింది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఈ ప్రావినసులోని అన్ని ముఖ్య పట్టణాల్లో జనాలు ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. కేవలం గత నెలలోనే 18 లక్షల మంది దాకా అస్వస్థతకు గురైనట్టు అధికారులు వెల్లడించారు. అత్యధిక వాయు కాలుష్యం కారణంగా ప్రావిన్స్ అంతటా ఐదురోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రజలను ఇళ్ళు దాటి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story