- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Blast in central Kolkata : భారీ పేలుడు.. హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: జూనియర్ డాక్టర్ల నిరసనతో అట్టుడికిపోతున్న పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతా(Kolkata)లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శనివారం SN బెనర్జీ రోడ్2లో పేలుడు(Explosion) సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా ఈ పేలుడు కారణంగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు((Explosion) పై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం(Forensic team) సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య నేపథ్యంలో గత నెల రోజుల నుంచి జూనియర్ డాక్టర్లు నిరసనలు తెలుపుతున్నారు. వారికి మద్దతుగా ప్రజలు, ప్రజా సంఘాలు కాలేజీలు, విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగరంలో అనుమాని పేలుడు(Suspected explosion) సంభవించడంతో అప్రమత్తమైన పోలీసులు కోల్‌కతాలో హై అలర్ట్(high alert) జారీ చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- kolkata