ఛత్తీస్‌గఢ్ స్పీకర్‌గా మాజీ సీఎం

by Harish |
ఛత్తీస్‌గఢ్ స్పీకర్‌గా మాజీ సీఎం
X

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం రమణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ తొలి సెషన్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే..ప్రొటెం స్పీకర్ రాం విచార్ నేతమ్ శాసనసభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ స్పీకర్‌గా రమణ్ సింగ్‌ను ఎన్నుకోవాలని ప్రతిపాదిం చగా..డిప్యూటీ సీఎం అరుణ్ సావో బలపరిచారు.

దీనికి కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో రమణ్ సింగ్ స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్‌ సభలో ప్రకటించారు. అనంతరం సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, రమణ్‌ సింగ్‌ ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా.. రాజ్‌నంద్‌గావ్‌ స్థానం నుంచి నాలుగు సార్లు (2008, 2013, 2018, 2023)లో గెలిచారు. 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు.



Next Story

Most Viewed