ఎవరెస్ట్, MDH మసాలాల నిషేధంపై వివరణ కోరిన కేంద్రం

by Disha Web Desk 17 |
ఎవరెస్ట్, MDH మసాలాల నిషేధంపై వివరణ కోరిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: నాణ్యత లోపం కారణంగా ఎవరెస్ట్, MDH మసాలాలను హాంకాంగ్, సింగపూర్ దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్ దీనికి గల కారణాలను పేర్కొంటూ వివరాలను అందించాలని హాంకాంగ్, సింగపూర్‌లోని రాయబార కార్యాలయాలను కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. ఇటీవల ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. ఆ ఉత్పత్తులను తిరిగి భారత్‌కు పంపివేయాలని ఆదేశించింది. అలాగే, MDH సాంబార్ మసాలాపై కూడా హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల వీటిని పరీక్షించగా, 'ఇథిలీన్ ఆక్సైడ్' అనే క్రిమిసంహారక మందులు పరిమితులకు మించి ఉన్నాయని గుర్తించారు. దీంతో ఈ రెండు మసాలాలపై నిషేధం విధించాయి.

ఈ నేపథ్యంలో భారత్ నిషేధానికి గల కారణాలపై వివరణాత్మక నివేదిక అందించాలని రెండు దేశాల్లో ఉన్న ఎంబసీలను ఆదేశించింది. ప్రస్తుతం రెండు దేశాలకు చెందిన ఆహార భద్రతా నియంత్రణ సంస్థల నుంచి భారత ఎంబసీ వివరాలు సేకరించే పనిలో ఉంది. మసాలాల నిషేధానికి గల కారణాలను కంపెనీల నుండి కోరాము. దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టాము. వివరాలు అందగానే సంబంధిత ఎగుమతిదారులతో చర్చిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఎవరెస్ట్, MDH మసాలాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది.



Next Story

Most Viewed