కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా విన్నా తప్పే- మోడీ

by Dishanational6 |
కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా విన్నా తప్పే- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ మాటల దాడి ఆగేలా లేదు. కాంగ్రెస్ పై మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఒకరు తమ మతవిశ్వాలను ఆచరించడం కూడా కష్టంగా ఉండేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అని ఆఱోపించారు. హనుమాన్ జయంతి రోజునే.. ప్రధాని మోడీ ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. రాజస్థాన్ లోని టోంక లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ఈ వ్యాఖ్లు చేశారు.

ఇటీవల రాజస్థాన్ బన్ స్వారా ర్యాలీలో ‘సంపదని పంచడం’పై తాను చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ మరోసారి ప్రస్తావించారు. ఆ కామెంట్స్ కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించాయని.. అందుకే ప్రతీచోటా తనని విమర్శిస్తున్నారని అన్నారు. ప్రజల సంపద లాక్కొని.. కొందరికే అది పంచేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతందనే.. సత్యం అందరికీ కన్పిస్తుందన్నారు.

రెండు మూడు రోజుల క్రితం తాను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టానని గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్, ఇండియా కూటమిని కోపం తెప్పించిందన్నారు. వారు ప్రతీ చోట తనని తిట్టడం ప్రారంభించారని మండిపడ్డారు. వాస్తవాలకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది? అని మోడీ ప్రశ్నించారు.

ప్రజల సంపదపై సర్వే చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసి ఉందని స్పష్టం చేశారు మోడీ. ప్రజల ఆస్తులపై ఎక్స్‌రే చేస్తామని కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రసంగంలో చెప్పారని గుర్తుచేశారు. మీ రహస్య ఎజెండా బయటపడిందని మీరు భయపడుతున్నారని కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒకరి విశ్వాసాన్ని అనుసరించడం కష్టమని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా మారిందని అన్నారు.



Next Story

Most Viewed