- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Elon Musk: నాటో కూటమి వ్యతిరేకంగా మస్క్ గళం..!

దిశ, నేషనల్ బ్యూరో: నాటో (NATO) కూటమిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి వెదొలగాలని అమెరికా(USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సీనియర్ సలహాదారు మైక్ లీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై మస్క్ రిప్లయ్ ఇచ్చారు. మైక్ లీ వ్యాఖ్యలకు మస్క్ మద్దతుపలికారు. నాటో, ఐక్యరాజ్యసమితి నుంచి వాషింగ్టన్ నిష్క్రమించాలని కోరారు. యూరప్ దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇప్పటికే, నాటో భవిష్యత్తుపై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది.ఇలాంటి సమయంలో మస్క్ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
నాటో దేశాల్లో నిధుల కేటాయింపుపై..
గతంలో నాటో దేశాల్లో నిధుల కేటాయింపుపైన ట్రంప్ స్పందించారు. కూటమిలో నిర్ణయించిన విధంగానే అన్ని దేశాలు రక్షణ వ్యవస్థ బలోపేతానికి తమ జీడిపీ నుంచి తగిన మొత్తంలో నిధులివ్వాలన్నారు. లేకపోతే, తమ రక్షణ దళాలను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. నాటో, యూరప్ దేశాలు కమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్ సహా వ్యూహాత్మక సైనిక నాయకత్వం, మందుగుండు సామగ్రి కోసం అమెరికాపై ఆధారపడుతోంది. మరోవైపు, రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే ఉద్దేశంతో ఈయూ దేశాలు గత వారం బ్రస్సెల్స్‌లో అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించాయి. తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్ యూరోల (841 బిలియన్ డాలర్ల)తో ప్రణాళిక ప్రతిపాదించాయి. రక్షణ కోసం సభ్య దేశాలకు 162.5 బిలియన్ డాలర్ల రుణాలను అందించే యూరోపియన్ కమిషన్ ప్రతిపాదనపై చర్చించాయి. అయితే, ఉక్రెయిన్ పట్ల అమెరికా తీరు యూరప్ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. అసలు యూఎస్ వ్యూహం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని ఈయూ రక్షణ కమిషనర్ ఆండ్రియస్ కుబిలియస్ అన్నారు.